News April 24, 2024
కోహ్లీకి జరిమానా

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా విధించింది. నిన్న KKRతో మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వివాదంతో మ్యాచు ఫీజులో 50 శాతం కోత వేసింది. నిన్న కోహ్లీ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చినట్లు స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా డుప్లెసిస్, సామ్ కరన్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 2, 2026
అందుకే నన్ను వదిలేసి వెళ్లిపోయాడు: మృణాల్

తాను నటిని కావడం వల్లే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పినట్లు మృణాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నువ్వు చాలా ఇంపల్సివ్‌గా ఉంటావు. నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు హీరోయిన్‌వి.. అది కూడా నాకు నచ్చదు’ అన్నాడని తెలిపారు. ఆ రిలేషన్ ముగిసిపోవడం తన మంచికేనని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చేవని మృణాల్ అన్నారు. ఆమె నటించిన ‘దో దీవానె సహర్ మేన్’ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News February 2, 2026
పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు.. నివారణ

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.
News February 2, 2026
మున్సి‘పోల్స్’’: 19608 నామినేషన్లు ఓకే

TG: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులిచ్చిన సమాచారాన్ని అధికారులు క్షుణ్నంగా పరిశీలించి పత్రాలను ఓకే చేశారు. మొత్తం 2,996 వార్డుల్లో 19,608 మంది బరిలో నిలిచారు. రేపటి (3వతేదీ) వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో పొందుపరుస్తుంది. ఈనెల 11న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.


