News April 24, 2024

కోహ్లీకి జరిమానా

image

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా విధించింది. నిన్న KKRతో మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వివాదంతో మ్యాచు ఫీజులో 50 శాతం కోత వేసింది. నిన్న కోహ్లీ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారమే ఔట్‌ ఇచ్చినట్లు స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా డుప్లెసిస్, సామ్ కరన్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 23, 2025

రికార్డు సృష్టించిన చైనా కృత్రిమ సూర్యుడు

image

చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1,000 సెకన్ల(16 నిమిషాలు)పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. ఇందులో భారత్‌తోపాటు అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

News January 23, 2025

12 ఏళ్ల తర్వాత రిలీజై.. రూ.100 కోట్లే లక్ష్యంగా!

image

తమిళ నటుడు విశాల్ హీరోగా సుందర్ తెరకెక్కించిన ‘మద గజ రాజా’ చిత్రం 12 ఏళ్ల తర్వాత విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలై ఇప్పటికే రూ.50 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ & ఓవర్సీస్‌లో విడుదలై రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 23, 2025

పబ్లిసిటీ కోసమే బాబు దావోస్ పర్యటన: గుడివాడ అమర్నాథ్

image

AP: CM చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి ఒట్టి చేతులతో వస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం రూ.వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాయని చెప్పారు. ‘దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసం తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులు రాబట్టడంలో CM అట్టర్ ఫ్లాప్. ఈ పర్యటన కోసం సర్కార్ రూ.3 కోట్ల ప్రజాధనం వృథా చేసింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.