News April 24, 2024

సూరత్ MP స్థానం ఎందుకు ఏకగ్రీవమైందంటే?

image

సూరత్‌ కాంగ్రెస్ MP అభ్యర్థి నీలేశ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో BJP అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ పత్రాల్లోని సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటంతో నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నీలేశ్‌‌కు ప్రత్యామ్నాయంగా నామినేషన్ వేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ పద్సాల నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. వీరిద్దరు వేసిన 4 నామినేషన్లూ రిజెక్ట్ అయ్యాయి.

Similar News

News October 15, 2024

KTRపై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 15, 2024

కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.

News October 15, 2024

GREAT: తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్‌గా మారింది

image

సినిమా స్టోరీని తలదన్నేలా తన తండ్రిని చంపిన వ్యక్తిని శిక్షించడం కోసం ఓ మహిళ పోలీస్‌గా మారిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. గిస్లేనే సిల్వా(35) అనే మహిళ తండ్రి జోస్ విసెంటేను 1999లో స్నేహితుడు రైముండే హత్య చేశాడు. 2013లో శిక్ష పడినా తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు చూస్తూ పెరిగిన సిల్వా లా చదివారు. తర్వాత పోలీసుగా మారారు. ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.