News April 24, 2024
సూరత్ MP స్థానం ఎందుకు ఏకగ్రీవమైందంటే?
సూరత్ కాంగ్రెస్ MP అభ్యర్థి నీలేశ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో BJP అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ పత్రాల్లోని సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటంతో నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నీలేశ్‌కు ప్రత్యామ్నాయంగా నామినేషన్ వేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ పద్సాల నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. వీరిద్దరు వేసిన 4 నామినేషన్లూ రిజెక్ట్ అయ్యాయి.
Similar News
News January 13, 2025
సెలవు రోజును నాశనం చేశారు.. ఇండిగోపై అభిషేక్ ఆగ్రహం
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో మండిపడ్డారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సరైన సమయానికే చేరుకున్నప్పటికీ మేనేజర్ సుస్మిత వేరే కౌంటర్లకు తిప్పడంతో ఫ్లైట్ మిస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది సాయం చేయకపోగా దురుసుగా ప్రవర్తించారన్నారు. తనకు వచ్చిన ఒక రోజు హాలిడేను నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అభిషేక్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
News January 13, 2025
రష్యాపై US ఆంక్షలు.. భారత్, చైనాపై ప్రభావం!
రష్యా చమురు పరిశ్రమపై US విధించిన తాజా ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. 2022 నుంచి చౌకగా లభిస్తున్న రష్యా చమురుకు ప్రధాన దిగుమతిదారులుగా ఉన్న భారత్, చైనాలకు ఈ ఆంక్షలు ప్రతికూలంగా పరిణమించాయి. చైనా షాన్డాంగ్లోని స్వతంత్ర చమురు సంస్థలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. భారత్ అవసరాల్లో మూడోవంతు రష్యా నుంచే వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది.
News January 13, 2025
Thank You పవన్ కళ్యాణ్: YCP
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్‌గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద ఆయన ఫొటోలను షేర్ చేసింది. కాగా తమ ప్రభుత్వంలో పూర్తిచేసిన కార్యక్రమాలపై వైసీపీ ఇవాళ్టి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించింది.