News April 24, 2024

పవన్ కళ్యాణ్ పర్యటనలు వాయిదా

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి. పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెంకు బయల్దేరేందుకు పవన్ హెలికాఫ్టర్ ఎక్కగా.. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని పేర్కొంది.

Similar News

News September 17, 2025

తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

image

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

News September 17, 2025

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

image

AP: ఇవాళ CM చంద్రబాబు విశాఖకు వెళ్లనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్లో జరిగే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో OCT 2వరకు చేపట్టనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు. మ.3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. తర్వాత VJA బయల్దేరతారు.

News September 17, 2025

మరికొన్ని గంటల్లో మ్యాచ్.. పాక్ ఆడుతుందా?

image

ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. షేక్‌హ్యాండ్ వివాదంలో <<17723523>>పాక్ డిమాండ్‌<<>>ను ICC తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే UAEతో మ్యాచ్‌లో దాయాది దేశం ఆడుతుందా? టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్‌ క్యాన్సిల్ చేసుకోగానే తప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో సందిగ్ధత కొనసాగుతోంది.