News April 24, 2024
ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు
1616: ప్రఖ్యాత నాటక రచయిత విలియం షేక్స్పియర్ మరణం
1791: అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ బుకానన్ జననం
1891: రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
1938: ప్రముఖ సింగర్ ఎస్.జానకి జననం
1992: సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం
ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం
నేడు ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం
Similar News
News February 5, 2025
హీరోపై కేసు నమోదు!
స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
News February 5, 2025
ఇండియాలో కాలుష్యంపై బ్రయాన్ ఏమన్నారంటే?
అమెరికన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఇండియాలో పర్యటిస్తుండగా నిఖిల్ కామత్ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే నిష్క్రమించడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం కాలుష్యమేనని బ్రయాన్ చెప్పుకొచ్చారు. ‘గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో నేను ఇంటర్వ్యూ మధ్యలో ఆపేశా. వాయుకాలుష్యం వల్ల నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. కళ్లు, గొంతు మండిపోతున్నాయి. నేను తెచ్చిన ఎయిర్ ప్యూరిఫయర్ కూడా కాలుష్యానికి పాడైంది’ అని చెప్పారు.
News February 5, 2025
ప్రైవేటు వీడియోల కేసు.. డ్రగ్ టెస్ట్‌లో నిందితులకు పాజిటివ్
అమ్మాయిల ప్రైవేట్ వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్ టెస్ట్‌లో మస్తాన్ సాయి, అతని ఫ్రెండ్ ఖాజాకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మస్తాన్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022లో తన ఇంట్లో పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి ఆ సమయంలో తనకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.