News April 24, 2024

ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు

image

1616: ప్రఖ్యాత నాటక రచయిత విలియం షేక్‌స్పియర్ మరణం
1791: అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ బుకానన్ జననం
1891: రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
1938: ప్రముఖ సింగర్ ఎస్.జానకి జననం
1992: సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం
ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం
నేడు ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం

Similar News

News January 22, 2025

ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త

image

తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 22, 2025

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!

image

UPలోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News January 22, 2025

నేను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో: డివిలియర్స్

image

తాను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో అనే అనుభూతి చెందుతున్నట్లు డివిలియర్స్ చెప్పారు. బంతిని ఊచకోత కోసే ఇతను గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నా కళ్లు ఇంకా పని చేస్తున్నాయి. గ్రౌండ్‌కు వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు. దీంతో త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని ఏబీ ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.