News April 24, 2024
మండే ఎండలు.. చల్లటి వానలు

AP: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు, విశాఖ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నిన్న గోస్పాడులో 45.3, వెదురూరులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పేర్కొంది.
Similar News
News April 19, 2026
కీవ్ సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని హోలోసివ్స్కీ జిల్లాలో వీధిలో వెళ్తున్న వారిపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్ మార్కెట్‌లోకి దూరి కొంతమందిని బందీలను చేసుకున్నాడు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రత్యేక దళాలు (KORD) జరిపిన ఆపరేషన్‌లో నలుగురు బందీలను విడిపించారు. దుండగుణ్ని కాల్చి చంపారు.
News April 19, 2026
ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (ఫొటోలో) జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.
News April 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


