News April 24, 2024

మండే ఎండలు.. చల్లటి వానలు

image

AP: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు, విశాఖ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నిన్న గోస్పాడులో 45.3, వెదురూరులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పేర్కొంది.

Similar News

News January 25, 2025

‘తండేల్’ ట్రైలర్ ఎప్పుడంటే?

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ మూవీ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News January 25, 2025

ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు ఎంజాయ్ చేశారు: వైసీపీ

image

AP: బిల్డప్పులు కొట్టడం తప్ప చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఏం లాభం లేదని వైసీపీ విమర్శించింది. ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు దావోస్‌లో ఎంజాయ్ చేసి వచ్చారని దుయ్యబట్టింది. 40 ఏళ్ల అనుభవమని, ఉత్త చేతులతో వచ్చారని సెటైర్లు వేసింది. దావోస్ పర్యటన డిజాస్టర్ అయిందని, బాబు పాలనని నమ్మి ఒక్క కంపెనీ MOU చేసుకోలేదని మండిపడింది.

News January 25, 2025

అప్పట్లో.. మామూలు హడావిడి కాదు! కదా..?

image

జెండా పండుగలు 90s కిడ్స్‌కు స్పెషల్ మెమొరీ. ఆటలపోటీలు, క్లాస్ రూం డెకరేషన్, మూలన ఉండే షూ, సాక్స్ వెతికి ఉతికించడం, యూనిఫామ్ ఐరన్, ఎర్లీగా రెడీ, దేశభక్తి నినాదాలతో పరేడ్, జెండావందనం, ప్రసంగం. ఇప్పుడంటే మెడల్స్, ట్రోఫీలు కానీ అప్పట్లో సోప్ బాక్స్, గ్లాసు, గిన్నెలే ప్రైజులు. చివరికి ఇచ్చే బిస్కెట్లు/చాక్లెట్లు ఇంట్లో చూపిస్తే అంత ఫీజు కడితే ఇచ్చేదివేనా? అని మనోళ్ల తిట్లు.
మీ మెమొరీ కామెంట్ చేయండి.