News April 24, 2024
నేహ ఫ్యామిలీకి సంఘీభావంగా ముస్లింల ర్యాలీ

కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ్ హత్యను ఖండిస్తూ నిన్న ముస్లింలు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వారు నిర్వహించే దుకాణాలను ఒక పూట మూసివేసి, నేహ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితుడు ఫయాజ్‌ను శిక్షించి, నేహ కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
Similar News
News December 31, 2025
మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.
News December 30, 2025
భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీస్

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు వైట్‌వాష్ చేశారు. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 రన్స్ తేడాతో విజయం సాధించారు. 176 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 160/7 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో దీప్తి, అరుంధతి, స్నేహ్ రాణా, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్ తలో వికెట్ తీశారు.
News December 30, 2025
ఫిబ్రవరిలో మున్సిపల్.. మేలో GHMC ఎన్నికలు?

TG: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. 2026 FEBలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేలా ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. MAY చివరి నాటికి GHMC, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరపాలని చూస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల గెజిట్ వచ్చిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.


