News December 29, 2025

ఖమ్మం: చైనా మాంజా విక్రయించిన వినియోగించిన చర్యలు: సీపీ

image

పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలవుతాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News January 2, 2026

ఖమ్మంలో త్వరలో ‘హరిత’ హోటల్.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. పర్యాటకులకు నాణ్యమైన భోజనం, విడిది సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన అనువైన స్థలాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

News January 2, 2026

‘పొలం బాట’తో రైతుల విద్యుత్ కష్టాలకు చెక్: ఎస్‌ఈ

image

అన్నదాతల విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘పొలం బాట’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 557 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, వేలాడుతున్న వైర్లు మరియు వంగిన స్తంభాలను సరిచేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎత్తైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలను ఏర్పాటు చేశామన్నారు.

News January 2, 2026

స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

image

పెనుబల్లి మండలం గణేశ్ పాడు సమీపంలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకెళ్లడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.