News April 24, 2024

బీజేపీ టార్గెట్ 400 కాదు.. 399

image

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పటి వరకు ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న నినాదంతో ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. నిన్న గుజరాత్‌లోని సూరత్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏ నేతలు ‘అబ్ కీ బార్ 399 పార్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా 1951 నుంచి ఇప్పటివరకు పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరుకుంది.

Similar News

News January 29, 2026

ప్రధానిగా మోదీనే బెస్ట్: ఇండియా టుడే సర్వే

image

భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని వివరించింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు పేర్కొంది.

News January 29, 2026

పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

image

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.

News January 29, 2026

ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు: ఇండియా టుడే సర్వే

image

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే NDAనే గెలుస్తుందని Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. NDAకు 352 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ‘ఇండీ’ కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్‌కు 20 శాతం(80 సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.