News April 24, 2024
బీజేపీ టార్గెట్ 400 కాదు.. 399

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పటి వరకు ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న నినాదంతో ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. నిన్న గుజరాత్‌లోని సూరత్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏ నేతలు ‘అబ్ కీ బార్ 399 పార్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా 1951 నుంచి ఇప్పటివరకు పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరుకుంది.
Similar News
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News April 18, 2026
సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.


