News April 24, 2024
రౌడీ బాయ్‌తో ప్రశాంత్ నీల్ మూవీ?

దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ హీరోతో సినిమాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లిన ప్రశాంత్ నీల్ ఆయన మేనేజర్‌తో సమావేశమయ్యారు. దీంతో రౌడీ బాయ్‌తో నీల్ సినిమా తీస్తారని చర్చ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా అర్జున్ రెడ్డిని మించి ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News March 18, 2026
నల్గొండ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్

రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. బుధవారం స్టార్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 5,250 మంది పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేస్తోందని తెలిపారు. మైనార్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
News March 18, 2026
వరి పండిస్తే అత్యధిక లాభం రాదు: రేవంత్

TG: రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలి. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతాం. రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో తెలిపారు.


