News April 24, 2024
రౌడీ బాయ్‌తో ప్రశాంత్ నీల్ మూవీ?

దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ హీరోతో సినిమాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లిన ప్రశాంత్ నీల్ ఆయన మేనేజర్‌తో సమావేశమయ్యారు. దీంతో రౌడీ బాయ్‌తో నీల్ సినిమా తీస్తారని చర్చ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా అర్జున్ రెడ్డిని మించి ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. ABVP ప్రస్థానమిదే!

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 77వ వసంతంలోకి అడుగు పెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగమైన ఈ సంస్థను 1949 జులై 9న ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ‘రాష్ట్రీయ ఛత్ర దివస్’ (జాతీయ విద్యార్థి దినోత్సవం)గా కార్యకర్తలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులలో జాతీయవాద భావనను పెంపొందించడం, విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ABVP పనిచేస్తోంది.
News July 9, 2025
5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
News July 9, 2025
YCP నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

AP: TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కోవూరు పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. త్వరలో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై పలు మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాయి.