News April 24, 2024

ధోనీని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు: రైనా

image

సీఎస్కే మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2014లో పంజాబ్ చేతిలో క్వాలిఫయర్-2లో ఓటమి తర్వాత ధోనీ చాలా కోపంగా కనిపించారని చెప్పారు. మిస్టర్ కూల్‌ని అలా ఎప్పుడూ చూడలేదని గుర్తు చేసుకున్నారు. చివరి వరకు క్రీజులో(31 బంతుల్లో 42*) ఉన్నా గెలిపించకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్‌లు, హెల్మెట్‌ని విసిరేశాడని చెప్పారు. కాగా ఈ మ్యాచులో రైనా 25 బంతుల్లోనే 87 పరుగులు చేశారు.

Similar News

News February 3, 2026

APSRTC కోసం 2,500 కొత్త బస్సులు

image

AP: ఈ ఏడాది చివరి నాటికి 2,500 ఎలక్ట్రిక్/CNG బస్సులను కొనుగోలు చేస్తామని RTC ఇన్‌ఛార్జ్ MD కృష్ణబాబు తెలిపారు. PM ఈ-బస్ పథకం కింద 1050 విద్యుత్ బస్సులు రానున్నాయని, అదనంగా మరో 1450 ఎలక్ట్రిక్, CNG బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. RTCలో డ్రైవర్లతో పాటుగా ఇతర నియామకాలను చేపడతామని, ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు EHSను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

News February 3, 2026

సమీకృత వ్యవసాయ విధానాలు (మోడల్స్)

image

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి సమగ్ర వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.

News February 3, 2026

APPLY NOW: 28,740 ప్రభుత్వ ఉద్యోగాలు

image

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్‌తో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. APలో 1060, TGలో 609 పోస్టులు ఉన్నాయి. <>అప్లై<<>> చేయడానికి FEB 14 చివరి తేదీ. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సైట్: https://indiapostgdsonline.gov.in/