News April 25, 2024
రిజ్వాన్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చిన అఫ్రీదీ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. T20 క్రికెట్లో అభినవ డాన్ బ్రాడ్‌మన్ అని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీదీ కొనియాడారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అఫ్రీదీని ఏకిపారేస్తున్నారు. ‘జోక్ ఆఫ్ ద ఇయర్’ అని కొంతమంది ఎద్దేవా చేశారు. ‘అతడు బ్రాడ్‌మన్ కాదు.. బ్రెడ్ మ్యాన్’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘రిజ్వాన్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చి.. ఆయన గౌరవాన్ని తగ్గించొద్దు’ అని ఫైర్ అవుతున్నారు.
Similar News
News April 1, 2026
‘ఏఐ సెక్సువల్’.. ఇప్పుడు కొత్త ట్రెండ్!

ఆహారపు అలవాట్లు, ఇష్టాలే కాదు బంధాల్లోనూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే ‘ఏఐ సెక్సువల్’. లైంగిక విషయాల గురించి ఏఐతో పంచుకునే వాళ్లు వాళ్లను ‘ఏఐ సెక్సువల్’గా పేర్కొంటున్నారు. JoiAI అనే ప్లాట్‌ఫామ్ సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్‌పై, 33% సెక్స్ చాట్‌కు AIని వినియోగిస్తున్నట్లు తేలింది. గోప్యత, ఫ్రీగా మాట్లాడొచ్చనే ఏఐపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
News April 1, 2026
‘పోలవరం’ అకౌంట్లోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది. సమీక్షించి తాజాగా నిధులు రిలీజ్ చేసింది.
News April 1, 2026
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల దీనిపై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో ధర పెరుగుతోంది.


