News April 25, 2024

రిజ్వాన్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చిన అఫ్రీదీ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

image

పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌.. T20 క్రికెట్లో అభినవ డాన్ బ్రాడ్‌మన్ అని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీదీ కొనియాడారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అఫ్రీదీని ఏకిపారేస్తున్నారు. ‘జోక్ ఆఫ్ ద ఇయర్’ అని కొంతమంది ఎద్దేవా చేశారు. ‘అతడు బ్రాడ్‌మన్ కాదు.. బ్రెడ్ మ్యాన్’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘రిజ్వాన్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చి.. ఆయన గౌరవాన్ని తగ్గించొద్దు’ అని ఫైర్ అవుతున్నారు.

Similar News

News January 22, 2025

మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.

News January 22, 2025

భారత్ పిచ్‌పై తేలిపోయిన RCB బ్యాటర్లు!

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

News January 22, 2025

GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్

image

హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్‌పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.