News April 25, 2024
93.5% మార్కులు.. మూర్ఛపోయిన విద్యార్థి

ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తే ఎగిరి గంతులు వేయడం కామన్. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ స్టూడెంట్‌కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఇటీవల UP SSC బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో టెన్త్ విద్యార్థి అన్షుల్ కుమార్(16)కు 93.5% మార్కులు వచ్చాయి. అయితే తనకు ఊహించినదానికంటే ఎక్కువ మార్కులు రావడంతో అతడు మూర్ఛపోయాడు. దీంతో అతడిని ICUలో చేర్చాల్సి వచ్చింది.
Similar News
News July 4, 2025
IIIT విద్యార్థుల జాబితా విడుదల

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. <
News July 4, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో 2025 డీఏ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం 55శాతం డీఏను 59శాతానికి పెంచుతారని తెలుస్తోంది. జులై నుంచే ఈ పెంపు అమల్లోకి రానుండగా, బకాయిలు మాత్రం 2026 జనవరి 1 తర్వాతే చెల్లిస్తారని సమాచారం. రానున్న 2 నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి, జులైలో డీఏను సవరిస్తారు.
News July 4, 2025
సిద్ధార్థ్ ‘3 BHK’ మూవీ రివ్యూ&రేటింగ్

తన తండ్రి సొంతిల్లు నిర్మించాలనే కలను హీరో నెరవేర్చాడా లేదా అన్నదానిపై ‘3 BHK’ మూవీని తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. సిద్ధార్థ్, శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ ఫరవాలేదనిపించాయి. డైరెక్టర్ శ్రీ గణేశ్ స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. సాంగ్స్ అలరించలేదు. కథను ముందే ఊహించవచ్చు. కొన్ని సీన్లు పదేపదే వస్తూ సీరియల్‌ను తలపిస్తాయి. రేటింగ్: 2.25/5