News January 4, 2026
బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్‌గా డా.రవిశేఖర్

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్‌గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.
Similar News
News February 3, 2026
సంకిలి చక్కెర కర్మాగారం మూతబడకుండా చర్యలు: మంత్రి కొండపల్లి

సంకిలి చక్కెర కర్మాగారం మూతపడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అమరావతి నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌తో మంగళవారం వీసీ నిర్వహించారు. చెరకు రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం అన్నివిధాలా కృతనిశ్చయంతో ఉందన్నారు. పరిశ్రమ మనుగడకు అనుగుణంగా చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. చెరకు వేసేందుకు ఇదే తగిన సమయమన్నారు.
News February 3, 2026
VZM: ‘నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేయాలి’

జిల్లాలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, ఎస్టీపీలకు, ఎంఎస్ఎంఈ పార్కులు, పరిశ్రమ విస్తరణకు భూసేకరణను త్వరగా పూర్తి చేసి శాఖలకు అప్పగించాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి గడువులు విధించారు.
News February 3, 2026
కుటుంబ సర్వే వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

వచ్చే మూడు రోజుల్లో కుటుంబ సర్వేను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన, ఇప్పటివరకు 60% పూర్తైందని, దీనిని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం కింద గుర్తించిన 1.10 లక్షల నిరక్షరాస్యులను మార్చి నెల ప్రత్యేక పరీక్షకు సిద్ధం చేయాలని, వాలంటీర్ల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని సూచించారు.


