News April 25, 2024

నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారు: రాయుడు

image

ముంబై ఇండియన్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారని ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ట్వీట్ చేశారు. ఒక ఆటగాడు అత్యుత్తమంగా మారేందుకు ఆ జట్టులో సానుకూల ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. భారత జట్టుకు ముంబై ఇండియన్స్ నుంచి వచ్చిన ఆటగాళ్ల రికార్డులు చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. ముంబై జట్టుకు ఎనిమిదేళ్లపాటు ఆడటం గొప్పగా ఉందని చెప్పారు.

Similar News

News March 13, 2026

LPG సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్

image

TG: రాష్ట్రంలో LPG సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ చర్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది.

IPL: ఆ జట్టులోకి స్టార్ ప్లేయర్

image

బంగ్లాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను KKR టీమ్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం ముజరబానిని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల T20 WCలో అతడు అద్భుతంగా రాణించారు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా 80 T20Iల్లో 90 వికెట్లు పడగొట్టారు. IPL ఆఫర్‌తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నారు.