News April 25, 2024

వెంకటేశ్, పొంగులేటిల వియ్యంకుడు

image

TG: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరు ఖరారైంది. హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటికి ఈయన వియ్యంకుడు. వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ పెళ్లి చేసుకోగా, పొంగులేటి కూతురు స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ వివాహమాడారు. రఘురాంరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలందించారు.

Similar News

News January 8, 2026

భారీ జీతంతో నీతిఆయోగ్‌లో ఉద్యోగాలు

image

<>నీతిఆయోగ్<<>> 31 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG/MBBS/BE/BTech ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గలవారు FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. Sr. అడ్వైజర్‌కు నెలకు రూ.3,30,000, అడ్వైజర్‌కు రూ.2,65,000, Sr. స్పెషలిస్టుకు రూ.2,20,000, స్పెషలిస్టుకు రూ.1,45,000 , Sr. అసోసియేట్‌కు 1,25,000, అసోసియేట్‌కు రూ.1,05,000 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: niti.gov.in

News January 8, 2026

రూ.26.30 కోట్ల ఫ్లాట్ కొన్న రోహిత్ భార్య

image

రోహిత్ శర్మ భార్య రితికా ముంబైలోని ప్రభాదేవీ ప్రాంతంలో రూ.26.30 కోట్ల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 2,760sq ft. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30వేలు చెల్లించారు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ దంపతులు నివాసం ఉంటున్న లగ్జరీ అహూజా టవర్స్‌లోనే ఈ ఫ్లాట్ ఉంది. రోహిత్ దంపతులు కొన్నేళ్లుగా రియల్‌ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.

News January 8, 2026

ఒత్తిడి పెరిగితే అందం తగ్గిపోతుంది

image

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.