News April 25, 2024

వెంకటేశ్, పొంగులేటిల వియ్యంకుడు

image

TG: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరు ఖరారైంది. హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటికి ఈయన వియ్యంకుడు. వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ పెళ్లి చేసుకోగా, పొంగులేటి కూతురు స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ వివాహమాడారు. రఘురాంరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలందించారు.

Similar News

News September 18, 2024

రూ.లక్ష కడితే టీడీపీలో శాశ్వత సభ్యత్వం: చంద్రబాబు

image

AP: ₹లక్ష చెల్లించిన వారికి TDP శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని పార్టీ నేతలతో CM చంద్రబాబు అన్నారు. లక్ష మంది సభ్యులు చేరితే, వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగించవచ్చని తెలిపారు. పలువురు నేతలతో నిన్న ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు.

News September 18, 2024

మండుతున్న ఎండలు.. 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

రెండు వారాల క్రితం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తగా ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్న ఏపీలోని కావలిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి గాలులు పూర్తిగా పొడిగా మారడం, మేఘాలు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏసీ, ఫ్యాన్లు లేకుండా ఉండలేకపోతున్నామని, వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

News September 18, 2024

పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

image

AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.