News April 25, 2024

తెగ గీకేశారు.. మార్చిలో గరిష్ఠానికి క్రెడిట్ కార్డుల ఖర్చు

image

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం రికార్డ్ స్థాయికి చేరింది. మార్చిలో ఈ కార్డుల ద్వారా ఖర్చు చేసిన మొత్తం రూ.1,64,586 కోట్లకు చేరింది. 2023 మార్చితో (రూ.1,37,310కోట్లు) పోలిస్తే 20% ఎక్కువ. ఆన్‌లైన్‌లో రూ.1,04,081 కోట్లు, ఆఫ్‌లైన్‌లో రూ.60,378 కోట్లు ఖర్చు చేశారు. క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ చెల్లింపులు నెల వ్యవధిలో 10% పెరిగాయి. ఫిబ్రవరిలో రూ.94,774కోట్లుగా ఉన్న మొత్తం MARకి రూ.లక్షకోట్లు దాటింది.

Similar News

News February 3, 2026

నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

image

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూచాడి శ్రీహరి రావు ప్రకటించారు. పార్టీ నిర్ణయం మేరకు మొత్తం 42 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేశారు. 1వ వార్డు కత్తి నరేందర్ నుంచి 42వ వార్డు వరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతో కూడిన పూర్తి లిస్ట్ ఇదే. అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News February 3, 2026

రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

News February 3, 2026

తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

image

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.