News April 25, 2024
ఇంకా ప్లేఆఫ్స్ రేసులో RCB?

ఈ సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములతో చతికిలపడినా ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో టేబుల్ టాప్‌లో ఉన్న RR, KKR, SRH తమపై మినహా అందరిపై గెలవాలి. PBKS, DC, CSK, GT, LSG, MI జట్లు ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు. ఇలా జరిగితే RCBకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ జరిగినా ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడక తప్పదు
Similar News
News February 3, 2026
రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
News February 3, 2026
తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.
News February 3, 2026
భారత్‌పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. టారిఫ్‌లు 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ PM మోదీతో మాట్లాడా. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. శక్తిమంతమైన నాయకుడు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు.


