News January 14, 2026
HYD: ఎంట్రీ FREE.. కైట్ ఫెస్టివల్‌కు వెళ్దాం పద!

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జోరుగా, హుషారుగా సాగుతోంది. 2వ రోజు సిటీలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్న పతంగులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు, కైట్ ప్లేయర్స్, కళాకారులు Way2Newsతో తమ ఒపినియన్స్ పంచుకున్నారు. రేపటితో కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. తొందరగా వెళ్లండి మరి.
GOOD NEWS ఏంటంటే ప్రవేశం ఉచితం.
Similar News
News February 14, 2026
Big Plan: హైదరాబాద్ మహా అవతారం!

HYD మరింత పెద్దది కాబోతోంది. ప్రస్తుతం HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దీన్ని 10,472 చదరపు KMకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా 11 జిల్లాల పరిధిలోని RRR ప్రాంతాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. ముఖ్యంగా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP) పద్ధతిలో 10 భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే HYD దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాల్లో ఒకటిగా మారుతుంది.
News February 14, 2026
భాగ్యనగరం దాహం తీరేదెలా?

HYD శరవేగంగా విస్తరిస్తున్నా మన నీటి సరఫరా మాత్రం 2012 నాటి 600 MGD దగ్గరే ఆగిపోయింది. కానీ ఇప్పుడు నగరానికి కావాల్సింది 835 MGD. అంటే రోజుకు 235 మిలియన్ గ్యాలన్ల భారీ కొరత ఉంది. ప్రస్తుతం అధికారులు కోర్ సిటీ నీటిని తగ్గించి, తెల్లాపూర్, కొల్లూరు లాంటి కొత్త ఏరియాలకు సర్దుబాటు చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు కానీ, అదనపు నీటి వనరులు పెరగకపోవడం గమనార్హం.
News February 14, 2026
HYD విశాఖ వెళ్లేవారికి గమనిక.. టైమింగ్ ఛేంజ్

సిటీ నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రెగ్యులర్‌గా నడుస్తోంది. లింగంపల్లి- విశాఖ (12806) ఉ.6:55 గం.కు బయలుదేరి విశాఖకు రాత్రి 7:50కు చేరుకుంటుంది. విశాఖ- లింగంపల్లి (12805) రైలు విశాఖలో 6:20 గం.కు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 7:15 గం.కు చేరుకుంటుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమలవుతాయి.


