News April 25, 2024
T20 వరల్డ్ కప్ కోసం హర్భజన్ టీమ్ ఇదే!

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును మాజీ క్రికెటర్ హర్భజన్ అంచనా వేశారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆయన ఎంపిక చేశారు. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, మహ్మద్ సిరాజ్‌కు చోటివ్వలేదు. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, కోహ్లీ, SKY, రిషభ్ పంత్ (WK), రింకూ సింగ్, సంజూ శాంసన్ (WK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.
Similar News
News January 26, 2026
బాలీవుడ్‌పై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు

బాలీవుడ్ ప్లాస్టిక్ విగ్రహాల మ్యూజియంగా మారిందని నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇండస్ట్రీకి, ఆడియన్స్‌కు మధ్య సంబంధం తగ్గిపోతోందని అన్నారు. హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయన్నారు. చూడటానికి అందంగా, అద్భుతంగా ఉన్నప్పటికీ మ్యూజియంలోని విగ్రహాల్లా ఉన్నాయని ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో పేర్కొన్నారు. తమిళ్, మలయాళ చిత్రాలు కంటెంట్ పరంగా క్రియేటివ్‌గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
News January 26, 2026
బీర సాగుకు అనువైన విత్తన రకాలు

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్.ఎస్.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.
News January 26, 2026
వాహనాలపై అలాంటి స్టిక్కర్లు వేస్తే..

TG: వాహనాలపై పోలీస్, ప్రెస్, అడ్వకేట్ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.


