News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

Similar News

News February 22, 2026

VZM: బిల్లులు ఎప్పుడు?

image

విజయనగరం జిల్లాలో పెండింగ్‌ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

News February 22, 2026

VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

image

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.

News February 22, 2026

గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

image

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.