News January 20, 2026
ఫ్రెంచ్ వైన్‌పై 200% టారిఫ్‌లు వేస్తా.. మాక్రాన్‌పై ట్రంప్ ఫైర్

గాజా శాంతి కోసం ప్రతిపాదించిన ‘Board of Peace’లో చేరడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుముఖంగా లేరన్న వార్తలపై ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ‘ఆయన ఎలాగూ త్వరలో పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఆయన అవసరం ఎవరికీ లేదు. కానీ పీస్ బోర్డులో చేరకపోతే ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ వేస్తా. అప్పుడు ఆయనే దారిలోకి వస్తారు’ అంటూ బెదిరించారు. ట్రంప్ టారిఫ్‌ల అస్త్రం వాడటం పరిపాటిగా మారింది.
Similar News
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News February 10, 2026
మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.


