News April 26, 2024
ప్రతిపక్షాల కల చెదిరిపోయింది: మోదీ
VVPAT వెరిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ‘EVMలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి ప్రతిపక్షాలు పాపం చేశాయి. దశాబ్దాల పాటు స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. రిగ్గింగ్ సాధారణం అయిపోయింది. ఇప్పుడు EVMలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాలెట్ వ్యవస్థ తిరిగిరాదని కోర్టు తేల్చిచెప్పడంతో వారి కల చెదిరిపోయింది’ అని విమర్శించారు.
Similar News
News November 17, 2024
గహ్లోత్ చుట్టూ ఢిల్లీ రాజకీయం
మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా ఢిల్లీలో సంచలనంగా మారింది. అవినీతిలేని పాలన, సామాన్యులకు ప్రాధాన్యం అనే మూల సిద్ధాంతాల్ని ఆప్ విస్మరించిందని ఆయన ఆరోపించడం విపక్ష BJPకి అస్త్రమైంది. మున్ముందు మరికొందరు ఆప్ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే చర్చ ప్రారంభమైంది. గహ్లోత్ రాజీనామా ఆప్ అవినీతి, అబద్ధాల పాలనకు నిదర్శనమని బీజేపీ విమర్శించింది. BJP, ED ఒత్తిడి వల్లే ఆయన రాజీనామా చేశారని ఆప్ చెబుతోంది.
News November 17, 2024
పట్నాకు బయల్దేరిన ‘పుష్ప’రాజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు స్పెషల్ ఫ్లైట్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పట్నాకు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
News November 17, 2024
నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్
నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పుఝల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్న ఆమెను చెన్నై పోలీసులు <<14631162>>హైదరాబాద్<<>>లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.