News November 17, 2024

నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్

image

నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పుఝల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్న ఆమెను చెన్నై పోలీసులు <<14631162>>హైదరాబాద్‌<<>>లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 13, 2024

అల్లు అర్జున్ న్యాయవాది ఈయనే!

image

అల్లు అర్జున్ తరఫున కోర్టులో వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నేతల కేసులను వాదిస్తుంటారు. ఆచార్య, ఘాజీ, క్షణం వంటి పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.

News December 13, 2024

సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నారు: కిషన్ రెడ్డి

image

అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. షో నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టు జరిగినట్లు అర్థం అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తోందనే విషయాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని ట్వీట్ చేశారు.

News December 13, 2024

అల్లు అర్జున్‌కు కోర్టు కీలక ఆదేశాలు

image

సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది. తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.