News April 26, 2024
ప్రతిపక్షాల కల చెదిరిపోయింది: మోదీ
VVPAT వెరిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ‘EVMలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి ప్రతిపక్షాలు పాపం చేశాయి. దశాబ్దాల పాటు స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. రిగ్గింగ్ సాధారణం అయిపోయింది. ఇప్పుడు EVMలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాలెట్ వ్యవస్థ తిరిగిరాదని కోర్టు తేల్చిచెప్పడంతో వారి కల చెదిరిపోయింది’ అని విమర్శించారు.
Similar News
News November 17, 2024
ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్!.. రెండో కుమారుడే ఖమేనీ వారసుడు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని వారసుడిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. 85 ఏళ్ల అయతుల్లా ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో వారసుడి ఎంపిక రహస్యంగా జరిగినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ 26న జరిగిన సమావేశంలో మొజ్తాబా ఎంపికను అసెంబ్లీ సభ్యులు ఆమోదించారు. అయతుల్లా బతికుండగానే మొజ్తాబాకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
News November 17, 2024
కోహ్లీని ఔట్ చేయడానికి ఎదురుచూస్తున్నా: మార్ష్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తెలిపారు. అతడి వల్ల ఎంత ముప్పు ఉందో తమకు తెలుసని పేర్కొన్నారు. ‘కోహ్లీతో కలిసి IPLలో ఆడాను కాబట్టి మైదానం వెలుపల ఎలా ఉంటారో నాకు తెలుసు. అతడ్ని రెచ్చగొట్టాలని మునుపెన్నడూ యత్నించలేదు. ఈసారి కూడా నా బౌలింగే మాట్లాడుతుంది. విరాట్ 30ల్లో ఉండగానే ఔట్ చేస్తా’ అని స్పష్టం చేశారు.
News November 17, 2024
గహ్లోత్ చుట్టూ ఢిల్లీ రాజకీయం
మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా ఢిల్లీలో సంచలనంగా మారింది. అవినీతిలేని పాలన, సామాన్యులకు ప్రాధాన్యం అనే మూల సిద్ధాంతాల్ని ఆప్ విస్మరించిందని ఆయన ఆరోపించడం విపక్ష BJPకి అస్త్రమైంది. మున్ముందు మరికొందరు ఆప్ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే చర్చ ప్రారంభమైంది. గహ్లోత్ రాజీనామా ఆప్ అవినీతి, అబద్ధాల పాలనకు నిదర్శనమని బీజేపీ విమర్శించింది. BJP, ED ఒత్తిడి వల్లే ఆయన రాజీనామా చేశారని ఆప్ చెబుతోంది.