News November 17, 2024
ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్!.. రెండో కుమారుడే ఖమేనీ వారసుడు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని వారసుడిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. 85 ఏళ్ల అయతుల్లా ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో వారసుడి ఎంపిక రహస్యంగా జరిగినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ 26న జరిగిన సమావేశంలో మొజ్తాబా ఎంపికను అసెంబ్లీ సభ్యులు ఆమోదించారు. అయతుల్లా బతికుండగానే మొజ్తాబాకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Similar News
News December 13, 2024
గ్రేట్.. రక్త దానం చేసి 24లక్షల మంది శిశువులకు ప్రాణం!
‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’ అని పేరున్న జేమ్స్ హారిసన్ 60 ఏళ్లుగా వారానికోసారి రక్త దానం చేస్తూ ఇప్పటి వరకు 24 లక్షల మంది శిశువులను రక్షించారు. ఈయన రక్తంలో ప్రత్యేకమైన యాంటీబాడీలు ఉన్నాయి. 14 ఏళ్ల వయస్సులో ఆయన రక్తమార్పిడిలో యాంటీ-డీని గుర్తించారు. ఆయనను ఆస్ట్రేలియాలో నేషనల్ హీరోగా పిలుస్తుంటారు. హారిసన్ దాతృత్వానికి అనేక అవార్డులూ ఆయన్ను వరించాయి.
News December 13, 2024
ఎల్లుండి అల్పపీడనం.. భారీ వర్షాలు
ద.అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశముందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఎల్లుండికి అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
News December 13, 2024
అల్లు అర్జున్ న్యాయవాది ఈయనే!
అల్లు అర్జున్ తరఫున కోర్టులో వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నేతల కేసులను వాదిస్తుంటారు. ఆచార్య, ఘాజీ, క్షణం వంటి పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.