News April 27, 2024

గుడ్‌న్యూస్.. పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు

image

ఏపీ పీజీ సెట్- 2024 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 4న గడువు ముగియనుండగా.. అపరాధ రుసుముతో మే 25వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య శశిభూషణరావు తెలిపారు. అర్హులు www.cetr.aprche.ap.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ, ఎంసీజే, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్ కోర్సులో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Similar News

News January 3, 2025

ఆ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

image

TG: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైరయ్యారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదు అందుతున్నాయని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తీరు మార్చుకోకపోతే ACBకి వివరాలు పంపిస్తానని, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సస్పెండైన వారిని మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తామన్నారు. అవినీతి సొమ్ము రికవరీ చేయిస్తానని చెప్పారు.

News January 3, 2025

మళ్లీ లాక్డౌన్ రానుందా?

image

ఐదేళ్ల తర్వాత కరోనా లాంటి మరో మహమ్మారి చైనాను వణికిస్తోంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన <<15048897>>HMPV<<>> (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2019 DEC31న చైనాలో కరోనా తొలి కేసును గుర్తించగా ఊహించని విధంగా 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 3, 2025

భారత్‌కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు

image

టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. బోలాండ్ వేసిన ఓవర్లో రిషభ్ పంత్, నితీశ్ కుమార్ ఔట్ అయ్యారు. ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పంత్ 40 పరుగులు చేసి ఔట్ కాగా, క్రీజులోకి వచ్చిన నితీశ్ గోల్డెన్ డక్ అయ్యారు. దీంతో టీమ్ఇండియా 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.