News April 27, 2024
గుడ్‌న్యూస్.. పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు

ఏపీ పీజీ సెట్- 2024 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 4న గడువు ముగియనుండగా.. అపరాధ రుసుముతో మే 25వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య శశిభూషణరావు తెలిపారు. అర్హులు www.cetr.aprche.ap.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ, ఎంసీజే, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్ కోర్సులో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Similar News
News April 16, 2026
భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
News April 16, 2026
మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.
News April 16, 2026
భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్‌తో పదిలం!

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్‌తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.


