News April 27, 2024
రాయి దాడి కేసు.. సబ్ జైలుకు సతీశ్
AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ కుమార్‌కు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు కోర్టు అతడికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని సబ్ జైలుకు తరలించారు. కాగా మూడు రోజులపాటు కుట్రకోణంపై సతీశ్‌ను పోలీసులు లోతుగా విచారించారు.
Similar News
News November 17, 2024
వారికి ప్రజా సంక్షేమం పట్టదు: సీతక్క
TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2024
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!
97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.
News November 17, 2024
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోంది: ఖర్గే
మణిపుర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ BJPని కాంగ్రెస్ నిలదీసింది. బీజేపీ పాలనలో ‘మణిపుర్ ఐక్యంగా లేదు, సురక్షితంగా లేదు’ అని ఖర్గే విమర్శించారు. 2023 నుంచి జరుగుతున్న హింస ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. ద్వేషపూరిత రాజకీయాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మణిపుర్ తగలబడాలని BJP చూస్తోందని ఖర్గే ఆరోపించారు.