News April 27, 2024
26/11 పేలుళ్ల ఘటన SPPకి బీజేపీ టికెట్

ముంబై 26/11 బాంబు పేలుళ్ల ఘటనలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(SPP)గా వాదనలు వినిపించిన ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన్ని ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలో నిలిపింది. ఈ స్థానం నుంచి బీజేపీ నేత మహాజన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నికమ్.. 1993 ముంబై బాంబు పేలుళ్లు, గుల్షన్ హత్య, ప్రమోద్ మహజన్ కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి అలుపెరగకుండా శ్రమించారు.
Similar News
News November 14, 2025
BREAKING: సౌతాఫ్రికా ఆలౌట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ బౌలర్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగారు. ఆయన దెబ్బకు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. మార్క్రమ్(31) టాప్ స్కోరర్ కాగా ముల్డర్ 24, రికెల్టన్ 23, జోర్జీ 24, వెరేన్ 16, స్టబ్స్ 15, బవుమా 3 పరుగులకే పెవిలియన్ చేరారు. సిరాజ్, కుల్దీప్ చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ తీశారు. కాసేపట్లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.
News November 14, 2025
అసమ్మతి నేతలను సైలెంట్ మోడ్‌లోకి నెట్టిన రేవంత్

TG: కాంగ్రెస్‌లో గ్రూపు వివాదాలు సాధారణం. ప్రాధాన్యం లేక నిరాశతో ఉన్న సీనియర్లు CM రేవంత్‌పై పలుమార్లు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినా వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే జూబ్లీ ఉపఎన్నికలో ఓటమి పాలైతే రేవంతే దీనికి కారణమని బలంగా ఫిర్యాదు చేయొచ్చని వారు భావించారు. కానీ పార్టీ గెలుపుతో నిరాశే ఎదురైంది. పక్కా ప్రణాళికతో సీనియర్లను CM సైలెంట్ మోడ్‌లోకి నెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News November 14, 2025
సెంచరీకి 5 ఓటముల దూరంలో రాహుల్: బీజేపీ సెటైర్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలపడటంపై BJP సెటైర్లు వేసింది. ఎన్నికల ఓటములకు చిహ్నంగా రాహుల్ మారారని విమర్శించింది. 2004 నుంచి ఇప్పటిదాకా 95 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని ఓ మ్యాప్‌ను షేర్ చేసింది. సెంచరీకి 5 ఓటముల దూరంలో ఉన్నారని ఎద్దేవా చేసింది. ‘మరో ఎన్నిక, మరో ఓటమి! ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. మొత్తం రాహుల్‌కే వస్తాయి’ అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.


