News April 28, 2024

మెట్రో విస్తరణకు అడుగులు!

image

TG: మెట్రో రైలు విస్తరణకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎయిర్ పోర్టుకు మెట్రో విస్తరణకు సాధ్యసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నాగోలు నుంచి చంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయానికి చేరుకునే మార్గంలో మెట్రో ఎండీ NVS రెడ్డి పర్యటించారు. స్థల సేకరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణం, ఫ్లైఓవర్లపై ఎదురయ్యే సవాళ్లను పరిశీలించారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 3, 2025

ప్రేమ కోసం పాక్‌కు.. ట్విస్ట్ ఇచ్చిన యువతి..!

image

ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్‌కు వెళ్లగా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన బాదల్ బాబు(30)కు పాక్‌కు చెందిన సనా రాణి(21)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు బాబు అక్రమంగా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ చేరుకున్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News January 2, 2025

మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

News January 2, 2025

ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.