News April 28, 2024
నేటి నుంచి సీఎం మలి విడత ప్రచారం

AP: సీఎం జగన్ నేటి నుంచి మలి విడత ఎన్నికల ప్రచారానికి తెర లేపనున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో.. ఆ తర్వాత వెంకటగిరిలో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. రోజుకు 3 సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం.
Similar News
News July 5, 2025
బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.