News April 28, 2024
నేటి నుంచి సీఎం మలి విడత ప్రచారం

AP: సీఎం జగన్ నేటి నుంచి మలి విడత ఎన్నికల ప్రచారానికి తెర లేపనున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో.. ఆ తర్వాత వెంకటగిరిలో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. రోజుకు 3 సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం.
Similar News
News April 20, 2026
ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News April 20, 2026
GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా
News April 20, 2026
అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


