News April 28, 2024

పవన్, చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు

image

AP: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న రాజోలు బహిరంగ సభలో సీఎం జగన్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పవన్ వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని YCP ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. అలాగే దెందులూరులో దళితులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధమని, చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News January 2, 2026

పార్టీయే ప్రాణం.. భర్తకు గుడ్‌బై!

image

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. BJP పట్ల విధేయత కారణంగా మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో వినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వివాదానికి దారి తీసింది. దీనిని పార్టీకి వెన్నుపోటుగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

News January 2, 2026

వంటింటి చిట్కాలు

image

☛ ఆకుకూరలను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఒకవేళ సూర్యకాంతి వాటిపై ఎక్కువగా పడితే వాటిలో ఉండే పోషక పదార్థాలు క్రమంగా నశిస్తాయి.
☛ ఆకుకూరలను పెద్దగా తరిగి వండటం వల్ల, అందులో ఉండే పోషక విలువలు తగ్గకుండా మన శరీరానికి అందుతాయి.
☛ క్యారెట్, ముల్లంగి వంటి వాటిని దుంపలతో పాటు వాటికి ఉండే ఆకులను కూడా వండుకొని తినాలి. ఇలా చేస్తే వాటిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

News January 2, 2026

Grok వ్యక్తి ప్రాణాలు కాపాడింది: మస్క్

image

నార్వేకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను X చాట్‌బోట్ Grok కాపాడింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడికి వైద్యులు సాధారణ గ్యాస్ సమస్యగా భావించి మందులిచ్చారు. అయినా తగ్గకపోవడంతో తన సమస్యను గ్రోక్‌కు వివరించగా అది అపెండిక్స్ లేదా అల్సర్ కావచ్చని CT స్కాన్ చేయించుకోవాలని సూచించింది. టెస్టులో అపెండిక్స్ పగిలే దశలో ఉన్నట్లు తేలడంతో వైద్యులు సర్జరీ చేసి కాపాడారు. ఈ విషయాన్ని మస్క్ వెల్లడించారు.