News April 28, 2024

పవన్, చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు

image

AP: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న రాజోలు బహిరంగ సభలో సీఎం జగన్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పవన్ వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని YCP ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. అలాగే దెందులూరులో దళితులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధమని, చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News April 14, 2026

ఇవాళ సెలవు

image

రాజ్యాంగ నిర్మాత Dr.BR అంబేడ్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఇవాళ సెలవు ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్లు, కోర్టులు, పోస్టాఫీస్‌లకు వర్తించనుంది. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. తమిళనాడు, అస్సాం నూతన సంవత్సరాలు, సిక్కుల అతిపెద్ద పండుగ బైసాఖీ, మహా విశ్వసంక్రాంతి పండుగలు కూడా నేడు జరుపుకుంటున్నారు. మీకూ సెలవు ఉందా?

News April 14, 2026

‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు?

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే డిజిటల్ రైట్స్‌ కోసం పెద్ద డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రైట్స్‌కు రూ.250 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News April 14, 2026

ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ కాస్తోంది. ఏపీలోని కడపలో నిన్న అత్యధికంగా 44.4 డిగ్రీలు, తెలంగాణలోని నిజామాబాద్‌లో 42.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ్టి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించాయి.