News April 28, 2024
పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: రేవంత్

TG: వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారు. సొంత నిర్ణయాలు తీసుకోను. పదేళ్ల తర్వాత పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేపడతా. ప్రజలెవరూ బీఆర్ఎస్ మీటింగ్‌లకు వెళ్లడం లేదు. కేసీఆర్‌లో ఇప్పటికైనా మార్పు రావాలి. పవర్ కట్‌పై కేసీఆర్ ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతిపక్షనేతగా ఆయన హుందాగా వ్యవహరించడం లేదు’ అని ఆయన విమర్శించారు.
Similar News
News January 20, 2026
జపాన్ వినూత్న పద్ధతి.. రైతును గౌరవించేలా!

జపాన్‌లో కూరగాయలు, పండ్ల ప్యాకెట్లపై వాటిని పండించిన రైతు ఫొటోను ముద్రిస్తారు. దీనిని ‘కావో నో మియెరు యసాయి’ అంటారు. 1970లో ప్రారంభమైన ఈ విధానం వల్ల తాము తినే ఆహారం ఎవరి కష్టం ద్వారా వచ్చిందో వినియోగదారులకు తెలుస్తుంది. ఇది రైతు శ్రమకు గుర్తింపునివ్వడమే కాకుండా కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. దీని వల్ల రైతుకు, కొనే వ్యక్తికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇలాంటి విధానం మన దగ్గరా ఉండాలా? COMMENT
News January 20, 2026
ఫ్రెంచ్ వైన్‌పై 200% టారిఫ్‌లు వేస్తా.. మాక్రాన్‌పై ట్రంప్ ఫైర్

గాజా శాంతి కోసం ప్రతిపాదించిన ‘Board of Peace’లో చేరడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుముఖంగా లేరన్న వార్తలపై ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ‘ఆయన ఎలాగూ త్వరలో పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఆయన అవసరం ఎవరికీ లేదు. కానీ పీస్ బోర్డులో చేరకపోతే ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ వేస్తా. అప్పుడు ఆయనే దారిలోకి వస్తారు’ అంటూ బెదిరించారు. ట్రంప్ టారిఫ్‌ల అస్త్రం వాడటం పరిపాటిగా మారింది.
News January 20, 2026
TN గవర్నర్ వాకౌట్‌కు కారణాలివే: లోక్‌భవన్

TN అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేయడానికి గల కారణాలను లోక్‌భవన్ వెల్లడించింది. ‘గవర్నర్ ప్రసంగిస్తుండగా పలుమార్లు మైక్రోఫోన్ ఆఫ్ చేశారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్లు, ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయి. నేరాల పెరుగుదల, 55% పెరిగిన POCSO కేసులు, 33% పెరిగిన లైంగిక వేధింపుల వంటి అనేక సమస్యలను ప్రసంగంలో ప్రస్తావించలేదు’ అని స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.


