News April 28, 2024

శ్రీరాముడిని అడిగితే బండి సంజయ్‌కి ఓటేయొద్దంటాడు: KTR

image

TG: BJP MP బండి సంజయ్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన KTR.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. బండికి జైశ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, ఒకవేళ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్‌కు ఓటు వేయవద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు.

Similar News

News November 14, 2025

ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్‌లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News November 14, 2025

4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్‌లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.

News November 14, 2025

వంటింటి చిట్కాలు

image

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.