News April 28, 2024
శ్రీరాముడిని అడిగితే బండి సంజయ్‌కి ఓటేయొద్దంటాడు: KTR

TG: BJP MP బండి సంజయ్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన KTR.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. బండికి జైశ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, ఒకవేళ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్‌కు ఓటు వేయవద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు.
Similar News
News April 14, 2026
గొప్ప ఆర్థికవేత్త అంబేడ్కర్!

భారత రాజ్యాంగ నిర్మాతగా అందరికీ తెలిసిన Dr.BR అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం ఆయన రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం IND, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడింది. దేశంలో RBI ఏర్పాటుకూ సహకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ, భారతీయులను ఆర్థిక బానిసలుగా మార్చిన తీరును తన పరిశోధనలతో ప్రపంచానికి చాటారు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి.
News April 14, 2026
క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News April 14, 2026
3K టు 152K.. రఫేల్‌లా దూసుకెళ్లిన ప్రఫుల్ ఫాలోయింగ్

నిన్న RRపై తొలి ఓవర్లోనే 3 వికెట్లు, మొత్తంగా 4 వికెట్లు కూల్చిన <<19644312>>ప్రఫుల్(SRH)<<>> ఇన్‌స్టాలో రఫేల్‌లా దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన అకౌంట్‌కు కేవలం 3 వేల ఫాలోవర్లు ఉండగా గంటల్లోనే ఆ సంఖ్య 152Kకు చేరింది. ఐపీఎల్ పవర్ ఇదేనని, 4 ఓవర్ల బౌలింగ్ ఆయన లైఫ్‌నే మార్చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాగే ప్రదర్శన చేస్తే తిరుగుండదని పేర్కొంటున్నారు. మీరేమంటారు?


