News April 29, 2024

వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం

image

TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News January 3, 2025

నిద్ర పోతున్నప్పుడు ఫోన్ ఎక్కడ ఉంచాలంటే?

image

చాలామంది రాత్రి నిద్రపోయేముందు తమ ఫోన్‌ను దిండు కింద, చేయి దగ్గర ఉంచి నిద్రిస్తారు. కానీ ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రించడానికి 2 లేదా 3 గంటల ముందు ఫోన్‌ను మరో రూమ్‌లో పెట్టి పడకగదిలోకి వెళ్లాలి. మధ్యలో టైమ్, అలారమ్ కోసం కావాలనుకుంటే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఆ సమయంలోనూ కొన్ని అడుగుల దూరంలో పెట్టాలి. పడకమీద ఫోన్ చూడకూడదని మీరే గట్టిగా నిశ్చయించుకోవాలి.

News January 3, 2025

ప్రేమ కోసం పాక్‌కు.. ట్విస్ట్ ఇచ్చిన యువతి..!

image

ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్‌కు వెళ్లగా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన బాదల్ బాబు(30)కు పాక్‌కు చెందిన సనా రాణి(21)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు బాబు అక్రమంగా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ చేరుకున్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News January 2, 2025

మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.