News April 29, 2024

వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం

image

TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News April 15, 2026

రజినీ 173వ మూవీ.. మళ్లీ డైరెక్టర్ మార్పు?

image

రజినీకాంత్ 173వ చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కమల్ హాసన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తొలుత సి.సుందర్‌ను డైరెక్టర్‌గా ఎంపిక చేయగా ఆయన తప్పుకున్నారు. తర్వాత శిబి చక్రవర్తి చేతికి ఆ ప్రాజెక్టు వెళ్లింది. ఇప్పుడు ఆయన స్థానంలో యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరపైకి వచ్చారు. త్వరలోనే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఓరి దేవుడా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో అశ్వత్ తెలుగులోనూ సుపరిచితమే.

News April 15, 2026

లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

image

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 15, 2026

బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.