News April 29, 2024
మే 1న 48.92 లక్షల మంది ఖాతాల్లో పింఛను జమ

AP: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో 48.92లక్షల మంది(74%) బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ తెలిపారు. వీరికి మే1న నేరుగా ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు వెల్లడించారు. మిగతా 16.58 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి అందిస్తామని చెప్పారు. మే 1 నుంచి 5వ తేదీ వరకు పింఛను పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
WPL: RCB నుంచి పెర్రీ ఔట్

JAN 9 నుంచి మొదలయ్యే WPLకు ముందు RCBకి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ సీజన్‌కు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పెర్రీ ప్లేస్‌లో IND ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరేను తీసుకున్నట్లు RCB తెలిపింది. 2024లో బెంగళూరు టైటిల్ సాధించడంలో పెర్రీ కీ రోల్ పోషించారు. అటు అన్నాబెల్ సదర్లాండ్(ఢిల్లీ), తారా నోరీస్(యూపీ వారియర్స్) కూడా WPLకు దూరమయ్యారు.
News December 30, 2025
చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కోల్డ్ చేస్తుందని అనుకుంటారు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ నేచురల్ హైడ్రేట్స్‌గా పనిచేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. స్కిన్‌ను పొడిబారకుండా కాపాడుతాయి. పొటాషియం బీపీని నియంత్రించడమే కాకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్కౌట్ తర్వాత/మధ్యాహ్నానికి ముందు తాగితే మంచిది. ఇవి సేఫ్, స్మార్ట్ & రిఫ్రెషింగ్ ఛాయిస్ కూడా.
News December 30, 2025
లంకతో చివరి టీ20.. స్మృతి ప్లేస్‌లో 17 ఏళ్ల అమ్మాయి ఎంట్రీ

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న చివరి(5వ) టీ20లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. స్మృతి మంధానకు రెస్ట్ ఇచ్చారు. ఆమె స్థానంలో 17 ఏళ్ల కమలిని తొలి మ్యాచ్ ఆడనున్నారు.
IND: షెఫాలీ, కమలిని, రిచా, హర్మన్, హర్లీన్, దీప్తి, అమన్‌జోత్, స్నేహ్ రాణా, అరుంధతీ రెడ్డి, వైష్ణవి, శ్రీచరణి
SL: పెరెరా, ఆటపట్టు, దులానీ, హర్షిత, దిల్హారి, నీలాక్షిక, రష్మిక సెవ్వండి, నుత్యాంగన, నిమశ, రణవీర, మాల్కి


