News April 30, 2024
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం

AP: సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు. ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12:30 గంటలకు కడప(D) మైదుకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.
Similar News
News December 30, 2025
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని.. మృత్యువులోనూ..

US యాక్సిడెంట్లో ఇద్దరు యువతులు మరణించడంతో పేరెంట్స్ గుండెలు బాదుకుంటున్నారు. మహబూబాబాద్(D)కు చెందిన <<18701423>>మేఘన<<>> (25), భావన(24) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మూడేళ్ల క్రితం USకు వెళ్లి డేటన్ యూనివర్సిటీలో MS చేశారు. సోమవారం మరో ఇద్దరు ఫ్రెండ్స్ (HYD)తో కలిసి యాత్రకు వెళ్లారు. కారు లోయలో పడటంతో మేఘన, భావన మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
News December 30, 2025
తిరుమలలో రద్దీ.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

✱TTD హెల్ప్‌లైన్(టోల్ ఫ్రీ): 155257
✱విచారణ కార్యాలయం: 0877-2277777
✱అశ్విని ఆసుపత్రి (తిరుమల): 0877-2263457 / 2263458
✱అంబులెన్స్ సేవలు: 0877-2263666(నేరుగా 108కి కాల్ చేయొచ్చు)
✱మెయిన్ హాస్పిటల్ (తిరుపతి): 0877-228777
✱విజిలెన్స్ ఆఫీస్ (TTD Security): 0877-2263333
✱తిరుమల క్రైమ్ పార్టీ: 0877-2263939
✱తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 0877-2263833
✱ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: 0877-2263733
News December 30, 2025
రాష్ట్రంలో 198 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

TGSRTCలో 198 ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి TGPRB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా, BE, బీటెక్ అర్హతగల వారు నేటి నుంచి JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫిజికల్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


