News April 30, 2024

జాగ్రత్త! తెలివిగా ఓటేయండి: హర్ష గోయెంకా

image

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఎన్నికల వేళ ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ట్విటర్ ఖాతా ద్వారా తరచూ పలు అంశాలపై ప్రజలకు సూచనలు చేసే ఆయన ఒక్క ఫొటోతో ఓటు విలువను చాటి చెప్పారు. ‘ప్రజలారా జాగ్రత్త! నేతల వాగ్దానాలపై కాకుండా పనితీరుపై ఆలోచించండి. తెలివిగా ఓటు వేయండి. మోసపోకండి’ అంటూ ట్వీట్ చేశారు. దానికి ‘పాలకుల చేతిలో మనం బకరా కావొద్దు’ అని అర్థం వచ్చేలా ఓ పెద్ద మేక ఫొటోను జతచేశారు.

Similar News

News March 7, 2026

గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

image

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

image

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.

News March 7, 2026

మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

image

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.